అటువంటి వారికే సాఫల్యం

ABN , First Publish Date - 2021-11-26T05:30:00+05:30 IST

దేవుని వాక్యం గొప్పతనాన్నీ, మహిమనూ పవిత్ర బైబిల్‌లోని హెబ్రీయులు అధ్యాయం ఇలా వివరించింది: దేవుని వాక్యం సజీవమైనది, అత్యంత శక్తిమంతమైనది. అది రెండువైపులా పదునుగా ఉండే కత్తికన్నా...

అటువంటి వారికే సాఫల్యం

దేవుని వాక్యం గొప్పతనాన్నీ, మహిమనూ పవిత్ర బైబిల్‌లోని హెబ్రీయులు అధ్యాయం ఇలా వివరించింది: దేవుని వాక్యం సజీవమైనది, అత్యంత శక్తిమంతమైనది. అది రెండువైపులా పదునుగా ఉండే కత్తికన్నా పదునైనది. అది ఎంత లోతుకు చొచ్చుకుపోగలదంటే... ఒక మనిషి బయటకు కనిపించేదానికీ, అతని అంతరంగానికీ మధ్య ఉండే వ్యత్యాసాన్ని సైతం బయట పెడుతుంది. అది కీళ్ళలోకీ, మూలుగలోకీ చొచ్చుకు వెళ్తుంది. హృదయంలో ఉన్న ఆలోచనలేమిటో, ఉద్దేశాలేమిటో బయటపెడుతుంది. 


దేవుడి మీద విశ్వాసం కుదరాలంటే ఆయన వాక్యాన్ని ఆలకించాలి. దాన్ని అనుసరించాలి. పైకి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, అంతరంగంలో సంశయాలతో ఉంటే... అది తోటి మానవులకు తెలియకపోవచ్చు. కానీ ఈ అనంత సృష్టిలో దైవం చూడలేనిదేదీ లేదు. దేవుడి సృష్టి అయిన ఈ భూమిపై జన్మించినవారు ఎప్పుడో ఒక రోజు దైవం ఎదుట నిలబడక తప్పదు. తాము చేసిన పాప పుణ్యాల లెక్కలను అప్పజెప్పకా తప్పదు. ఇది ఎవరికైనా, ఏ కాలానికైనా వర్తించే విషయం. ఆ సంగతి గ్రహించినవారు తమ విశ్వాసాన్ని గట్టిపరచుకుంటారు. దైవ వాక్యాన్ని తమ హృదయంలో పదిలంగా నిలుపుకొంటారు. ఆ వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటారు. అలాంటి వారే జీవన సాఫల్యాన్ని పొందుతారు.

Updated Date - 2021-11-26T05:30:00+05:30 IST