ఉపనిషత్‌ సారాంశము

ABN , First Publish Date - 2021-12-17T05:30:00+05:30 IST

భారతీయ తాత్విక చింతన విశ్లేషణలో ఉపనిషత్తులు ప్రధానమైన

ఉపనిషత్‌ సారాంశము

భారతీయ తాత్విక చింతన విశ్లేషణలో ఉపనిషత్తులు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ప్రస్తుతం మనకు 108 ఉపనిషత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ద్వాదశోపనిషత్తులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వీటిలోని మూలమంత్రాలన్నీ సంస్కృతంలో ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవటం కష్టమైన పని. దీనిని సులువు చేయటం కోసం ఆచార్య బి.ఎస్‌.ఎస్‌. రావు (శ్యామ శాస్త్రి) రచించిన గ్రంథం ‘ఆత్మవిద్యా ప్రకాశము’. దీనిలో మొత్తం 14 ఉపనిషత్తుల( తైత్తిరి, కఠ, శ్వేతాశ్వతర, నారాయణ, ఈశావాస్య, గణపతి, కైవల్య, ద్వాదశలతో పాటుగా ఛాందోగ్య, బృహదారణ్యక) మూలమంత్రాలకు తాత్పర్య సహితంగా అర్థాన్ని సులభమైన తెలుగులో అందించారు. ఉపనిషత్తుల సారాన్ని గ్రహించాలనుకొనేవారు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథమిది. 


ఆత్మవిద్యాప్రకాశము

రచయిత: ఆచార్య శ్యామ శాస్త్రి

ఉగాది ప్రచురణలు

ప్రతులకు: 9866472441

9573672695


Updated Date - 2021-12-17T05:30:00+05:30 IST