దశోపనిషత్తులంటే...
ABN , First Publish Date - 2021-11-26T05:30:00+05:30 IST
ఆత్మ, అనాత్మల భేదం, జీవుడు, పరమేశ్వరుల మధ్య సంబంధం, సృష్టి అంటే పుట్టుక, స్థితి, లయం అంటే మరణాలకు సంబంధించిన సందేహాల గురించి పూర్వ ఋషులు సాగించిన చర్చల సారమే..

ఆత్మ, అనాత్మల భేదం, జీవుడు, పరమేశ్వరుల మధ్య సంబంధం, సృష్టి అంటే పుట్టుక, స్థితి, లయం అంటే మరణాలకు సంబంధించిన సందేహాల గురించి పూర్వ ఋషులు సాగించిన చర్చల సారమే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివరి భాగాలుగా ఉంటాయి. ఇవి పూర్తిగా జ్ఞానం, జిజ్ఞాసలకు సంబంధించినవి.
చతుర్వేదాలకూ, ఆ వేదాల శాఖలకూ కలిపి పదకొండువందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవిగా 108 ఉపనిషత్తులను పూర్వులు ప్రస్తావించారు. వాటిలో పది అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. అవి: తైత్తరీయోపనిషత్తు, ఛాందగ్యోపనిషత్తు, ఈశావ్యాపోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేశోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు. ఐతరేయోపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్తు, ఛాందగ్యోపనిషత్తు. ఈ దశోపనిషత్తులను చదివితే... సకల ఉపనిషత్ సారం గ్రహించవచ్చని పెద్దలు చెబుతారు.