నెలసరి నలతా?
ABN , First Publish Date - 2021-08-24T05:30:00+05:30 IST
పొత్తికడుపు నొప్పి, రొమ్ముల సలపరం లాంటి ఇబ్బందులు నెలసరి ముందు వేధిస్తున్నాయా? ఈ ‘ప్రి - మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పి.ఎమ్.ఎస్) లక్షణాలను వదిలించడం కోసం...
పొత్తికడుపు నొప్పి, రొమ్ముల సలపరం లాంటి ఇబ్బందులు నెలసరి ముందు వేధిస్తున్నాయా? ఈ ‘ప్రి - మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పి.ఎమ్.ఎస్) లక్షణాలను వదిలించడం కోసం కొన్ని పదార్థాలను తప్పక తీసుకోవాలి.
- రాత్రంతా నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్ష, కుంకుమపువ్వులను పరగడుపున తీసుకోవాలి.
- ఉదయం, మధ్యాహ్నం, రాత్రి - మూడు పూటలా ఆహారంతో పాటు నెయ్యి తీసుకోవాలి.
- నెలసరి సమయంలో వేధించే మలబద్ధకం వదలాలంటే గుప్పెడు జీడిపప్పు లేదా వేరుసెనగపప్పులను బెల్లంతో కలిపి తినాలి.
- రాత్రి భోజనంగా సగ్గుబియం్య కిచిడీ, లేదా రాగి దోసెలు తినాలి.
- పెసలు, అలసందలు, మినుములతో పాటు పెరుగును మధ్యాహ్న భోజనంలో చేర్చుకోవాలి.