పిల్లల ఆహారం ఇలా...

ABN , First Publish Date - 2021-10-07T05:30:00+05:30 IST

పిల్లల ఆహార విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఇష్టంగా తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు....

పిల్లల ఆహారం ఇలా...

  1. పిల్లల ఆహార విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఇష్టంగా తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. కాబట్టి ఇష్టంగా తింటున్నారని కాకుండా, పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిదో దాన్ని తినిపించే ప్రయత్నం చేయాలి. 
  2. పిల్లలకు వేపుడు పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను పెట్టకూడదు. ఈ రకమైన ఆ పిల్లలు ఇష్టపడే మరో స్నాక్స్‌ చిప్స్‌. క్యాలరీలు, ఉప్పు, అనారోగ్యకరమైన ఫాట్‌.. ఇలా వీటిలో అన్నీ ఎక్కువే. అందుకే పిల్లలకు వీటి బదులు ఉడికించిన బంగాళదుంపలు, ఇంట్లో చేసిన పాప్‌కార్న్‌ అందించాలి.

  3. ప్యాకేజ్డ్‌ ఫ్రూట్‌ జ్యూస్‌లు, స్పోర్ట్స్‌ డ్రింక్‌లలో షుగర్‌ పాళ్లు ఎక్కువ. ఇవి పిల్లల్లో కావిటీకి కారణమవుతాయి.  వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, తాజా పండ్లతో చేసిన జ్యూస్‌లు ఇవ్వాలి.
  4. పిల్లలు కెచప్‌ కావాలంటారు. కానీ కెచప్‌లలో ప్రిజర్వేటివ్స్‌ వాడతారు. అలాంటి ప్రాసెస్డ్‌ కెచప్‌ కన్నా ఇంట్లో చేసిన టొమాటో చట్నీని పిల్లలకు అందివ్వాలి.
  5. ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాటిలో కృత్రిమ ఫ్లేవర్స్‌ వాడతారు. అందుకే పిల్లలకు ఇంట్లో చేసిన పెరుగు వేసుకునేలా ప్రోత్సహించాలి.
  6. ప్యాకేజ్డ్‌ సెరల్స్‌ బ్రేక్‌ఫాస్ట్‌గా పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి. కానీ అవి పిల్లల దంతాలకు హాని చేస్తాయి. అందుకే వాటి జోలికి వెళ్లకుండా బాయిల్డ్‌ ఎగ్స్‌, ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా అందించాలి.

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST