వండేటప్పుడు ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-01-24T06:32:51+05:30 IST

వండే ముందు గింజ ధాన్యాలను పదే పదే కడగకూడదు. ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకూడదు. కూరగాయలను ఉడికించిన నీటిని పారబోయకుండా సూప్‌లా చేసుకుని తాగితే మంచిది...

వండేటప్పుడు ఇలా చేసి చూడండి!

వండే ముందు గింజ ధాన్యాలను పదే పదే కడగకూడదు. ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకూడదు. కూరగాయలను ఉడికించిన నీటిని పారబోయకుండా సూప్‌లా చేసుకుని తాగితే మంచిది. ఆహారపదార్థాలను వండేటప్పుడు గిన్నెపై తప్పనిసరిగా మూతపెట్టాలి. కూరగాయలను బాగా ఫ్రై చేసి తింటే ఒంటికి మంచిది కాదు. అందుకే వాటిని కుక్కర్‌లో ఉడకబెట్టి వండుకుంటే ఆ కూరకి నూనె ఎక్కువ పట్టదు. ఆరోగ్యానికి కూడా ఇలా వండిన కూరలు ఎంతో మంచిది. 


పప్పులు, కూరగాయలు వండేటప్పుడు వాటిల్లో వంటసోడా వాడడం మంచిది కాదు. మసాలు బాగా వేసి వండిన కూరలు బాగా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇవి దంతాలను పాడుచేస్తాయి. అందుకే ఇలాంటి పదార్థాలను తిన్నప్పుడు నీటిని బాగా తాగాలి.

Read more