కలల పంట కనుల పండగ అవ్వాలంటే!

ABN , First Publish Date - 2021-03-14T05:36:05+05:30 IST

పిల్లలను పెంచడం ఒక కళ. అది కొందరికి అమ్మమ్మ, నానమ్మల ద్వారా, మరికొందరికి అనుభవం ద్వారా అబ్బుతుంది. అందరిలానే సెలబ్రిటీలు కూడా పిల్లల పెంపకంలో పెద్దవాళ్ల సలహాలు తీసుకున్నవారే. ఏదో ఒక సందర్భంలో తమ పిల్లల విషయంలో

కలల పంట కనుల పండగ అవ్వాలంటే!

పిల్లలను పెంచడం ఒక కళ. అది కొందరికి అమ్మమ్మ, నానమ్మల ద్వారా, మరికొందరికి అనుభవం ద్వారా అబ్బుతుంది. అందరిలానే సెలబ్రిటీలు కూడా పిల్లల పెంపకంలో పెద్దవాళ్ల సలహాలు తీసుకున్నవారే. ఏదో ఒక సందర్భంలో తమ పిల్లల విషయంలో తాము పాటించిన సలహాలను పంచుకున్నవారే.దీనిపై కొందరు హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు ఏం చెబుతున్నారంటే...


కాజోల్‌

ఇద్దరు పిల్లల తల్లి అయిన కాజోల్‌ తరచుగా వాళ్ల అమ్మ చెప్పిన మాట గుర్తుచేసుకుంటారు. ‘‘పిల్లలకు తమ గురించి తాము ఆలోచించుకోవడం నేర్పించాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సొంతంగా తీసుకునేలా పిల్లలను పెంచాలి’’ అని మా అమ్మ తనూజా నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేది. అదే సలహాను నేను నా పిల్లల విషయంలో అచరణలో పెట్టాను.


ఏంజిలినా జోలీ

‘పిల్లలు తమ తల్లులు పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకోరు. నిజాయతీగా ఉండాలని అనుకుంటారు’ అనేది హాలీవుడ్‌ నటి ఏంజిలినా జోలి అభిప్రాయం. ‘‘పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకు సహాయం చేయాలనుకుంటారు. అయితే మీరు వారితో మీ అనుబంధం ఎలా ఉందనే దానిని బట్టి వారి ప్రవర్తన ఉంటుంది. ఈ ప్రయాణంలో వారు మీ ఉన్నతికి సహకరిస్తారు. ఇద్దరూ కలిసికట్టుగా మెరుగవుతారు’’అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిందీ హాలీవుడ్‌ భామ. 


రవీనా టాండన్‌

‘‘తల్లిదండ్రులుగా పిల్లలకు కొన్ని పరిమితులు, కట్టుబాట్లు విధించడంతో పాటు వారితో సరదాగా ఉండడమూ ముఖ్యమే’’ అంటున్నారు రవీనా టాండన్‌. తన ఇద్దరు కూతుళ్లతో ఆమె ప్రతి విషయాన్ని పంచుకుం టారు. దాంతో వారు తన అనుభవాలు, తప్పొప్పుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారని నమ్ముతారు. 


సుస్మితా సేన్‌

సూపర్‌ మోడల్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుస్మితా సేన్‌ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు సింగిల్‌ పేరెంట్‌.  ‘‘తల్లిగా పిల్లల పెంపకాన్ని ఆస్వాదించాలి. అంతే తప్ప సమాజం లేదా ఎవరైనా ఏమనుకుంటారో అని ఆందోళన చెందకూడదు’’ అని ఆమె గట్టిగా నమ్ముతారు.

Updated Date - 2021-03-14T05:36:05+05:30 IST