ఎలివేషన్‌తోనే ఇంటికి లుక్‌

ABN , First Publish Date - 2021-07-12T06:49:59+05:30 IST

ఇంటి లోపల నచ్చినట్టుగా డిజైన్‌ చేసుకోవడం ఒక ఎత్తయితే, బయట ఆకట్టుకునేలా కనిపించేలా ఎలివేషన్‌ డిజైన్‌ చేయించుకోవడం మరో ఎత్తు.

ఎలివేషన్‌తోనే ఇంటికి లుక్‌

ఇంటి లోపల నచ్చినట్టుగా డిజైన్‌ చేసుకోవడం ఒక ఎత్తయితే, బయట ఆకట్టుకునేలా కనిపించేలా ఎలివేషన్‌ డిజైన్‌ చేయించుకోవడం మరో ఎత్తు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ గీయించుకునే సమయంలోనే స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ను కలిసి ఎలివేషన్‌ డిజైన్‌ చేయించుకోవాలి. ఇందులో కూడా ఫేసింగ్‌ను బట్టి డిజైన్‌ చేయించుకోవాలి. రోడ్డు ఫేసింగ్‌ ఎంత ఉన్నది అనే దానిబట్టి ఎలివేషన్‌ గీస్తారు. ఇదంతా మరిచిపోయి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే గూగుల్‌లో సెర్చ్‌ చేస్తారు. ఇది కంప్లీట్‌గా తప్పు. ఎలివేషన్‌ డిజైన్‌ స్ట్రక్చరల్‌ డ్రాయింగ్‌పైన ఆధారపడి ఉంటుంది. ఎలివేషన్‌ బాగుంటే ఇంటి ధర 25 శాతం పెరుగుతుంది.

 

తూర్పు సైడ్‌ రోడ్డు ఉన్న ఇల్లయితే ఆగ్నేయంలో మెట్లు తీసుకోవాలి. దానికి కావలసిన రెయిలింగ్‌ 12ఎంఎం గ్లాసుతో డిజైన్‌ చేసుకుని, స్టీల్‌తో ఫ్రేమింగ్‌ డిజైన్‌ చేయించుకోవాలి. తరువాత బ్రిక్‌ వర్క్‌ చేసి ఎల్లోస్టోన్‌ గ్లాడింగ్‌ చేసుకుని వైట్‌ కలర్‌ పెయింట్‌ వేస్తే ఎలివేషన్‌ చాలా అందంగా ఉంటుంది. దీనికి చదరపు అడుగుకి రూ.250 వరకు ఖర్చవుతుంది. ట్రాన్స్‌పోర్టేషన్‌, లేబర్‌ చార్జీలు అన్నీ కలుపుకొని. 


రోడ్డు ఫేసింగ్‌ 40 అడుగులు ఉంటే కనుక 12 అడుగులు గేట్‌ కోసం వదిలేసి మిగతా 28 అడుగులు ఎలివేషన్‌ కోసం తీసుకోవాలి. రోమ్‌ టైపు కావాలనుకునే వారు కింద బేస్‌ నుంచి రెండు పిల్లర్లు తీసుకోవాలి. పై నుంచి కిందకు ఎల్‌ఈడీ ఫోకస్‌ లైట్లు అమర్చుకోవాలి. అల్యూమీనియం గ్లాస్‌ ఫ్రేమ్‌లు అమర్చి దాని చుట్టూ పట్టీలాంటిది డిజైన్‌ ఇచ్చి ఫోకస్‌ లైట్లు అమర్చుతారు. తక్కువ ఖర్చులో కావాలనుకునే వారు షెరా బోర్డు ఎంచుకోవచ్చు. ఇది చదరపు అడుగుకి రూ.175 వరకు ఖర్చవుతుంది. ఈ ఎలివేషన్‌ కూడా మంచి లుక్‌తో ఆకట్టుకునేలా ఉంటుంది.


స్టెయిన్‌లె్‌స స్టీల్‌ ప్లేట్‌తో ఎలివేషన్‌ డిజైన్‌ చేసుకోవచ్చు. దీన్ని స్టెన్సిల్‌ ఎలివేషన్‌ అంటారు. మూడున్నర ఇంచుల గ్యాప్‌ ఇచ్చి గోడకి ఎల్‌ఈడీలు అమర్చుతారు. స్టీల్‌ప్లేట్‌పై మీరు కోరుకున్న డిజైన్‌ని ఎంబోస్‌ చేస్తారు. రాత్రివేళ లైట్లు వేస్తే అద్భుతమైన లుక్‌ వస్తుంది.

 

మరొకటి చెస్‌బోర్డు ఎలివేషన్‌. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ తరహా ఎలివేషన్‌ ఎక్కువగా కనిపిస్తుంది. ఇల్లు మొత్తం బ్లాక్‌ అండ్‌ వైట్‌లో డిజైన్‌ చేస్తారు.

కె.పి. రావు

ప్రముఖ ల్యాండ్‌స్కేప్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌

ఫోన్‌: 8019411199

Updated Date - 2021-07-12T06:49:59+05:30 IST