హిట్‌2...బిగ్గర్‌ అండ్‌ బెటర్‌!

ABN , First Publish Date - 2021-03-21T05:57:34+05:30 IST

అడివి శేష్‌ హీరోగా శనివారం ‘హిట్‌ 2’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ది సెకండ్‌ కేస్‌... అనేది ఉపశీర్షిక. వాల్‌ పోస్టర్‌ పతాకంపై నాని సమర్పణలో ప్రశాంతి నిర్మిస్తున్నారు

హిట్‌2...బిగ్గర్‌ అండ్‌ బెటర్‌!

అడివి శేష్‌ హీరోగా శనివారం ‘హిట్‌ 2’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ది సెకండ్‌ కేస్‌... అనేది ఉపశీర్షిక. వాల్‌ పోస్టర్‌ పతాకంపై నాని సమర్పణలో ప్రశాంతి నిర్మిస్తున్నారు. ‘హిట్‌’ను వాళ్లిద్దరూ నిర్మించిన సంగతి తెలిసిందే. ‘హిట్‌’తో దర్శకుడిగా పరిచయమైన శైలేష్‌ కొలను, ఫ్రాంఛైజీలో ఈ రెండో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ అధికారి, ఓ అమ్మాయి మిస్సింగ్‌ కేసును ఎలా పరిష్కరించారన్న కథాంశంతో ‘హిట్‌’ (హోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) రూపొందించాం. ఇప్పుడు ఏపీకి చెందిన ‘హిట్‌’ అధికారి కృష్ణదేవ్‌ ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేయబోతున్నారు’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘ఇందులో కృష్ణదేవ్‌ అలియాస్‌ కేడీగా నటించబోతున్నా. హిట్‌2... బిగ్గర్‌ అండ్‌ బెటర్‌, బ్యాడ్‌-యాస్‌. ‘మేజర్‌’ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. కానీ, వేడి ఇప్పుడే మొదలైంది. నానితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది’’ అని అడివి శేష్‌ అన్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, రావు రమేశ్‌, భానుచందర్‌, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ మాగంటి, కోమలి ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: మనీషా ఎ. దత్‌, ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌, సంగీతం:జాన్‌ స్టీవర్స్‌ ఎడురి, సినిమాటోగ్రఫీ:మణికందన్‌.

Updated Date - 2021-03-21T05:57:34+05:30 IST