ఆనందమే అందం!

ABN , First Publish Date - 2021-10-28T05:30:00+05:30 IST

కథానాయిక హన్సిక మోత్వానీ ఇన్‌స్టాలో సహజమైన ఫొటోలు షేర్‌ చేసి సందడి చేస్తుంటుంది. ఆమె స్కిన్‌టోన్‌కి చాలా మంది ఫిదా అవుతుంటారు. ఈ ..

ఆనందమే అందం!

కథానాయిక హన్సిక మోత్వానీ ఇన్‌స్టాలో సహజమైన ఫొటోలు షేర్‌ చేసి సందడి చేస్తుంటుంది. ఆమె స్కిన్‌టోన్‌కి చాలా మంది ఫిదా అవుతుంటారు. ఈ ఉత్తరాది బ్యూటీ ఆనందంగా ఉండటమే అందమంటోంది. ఈ న్యాచురల్‌ బ్యూటీ చెప్పిన బ్యూటీ టిప్స్‌.


‘‘అదృష్టం కొద్దీ నాకు మంచి స్కిన్‌టోన్‌. ఎంత అందంగా ఉండేవారైనా చర్మ సంరక్షణ, చర్మ సౌందర్యం పట్ట దృష్టి కేంద్రీకరించాల్సిందే. నా సెన్సిటివ్‌ స్కిన్‌ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటా. ముట్టుకుంటే కందిపోయే చర్మం ఉండే నేను సూర్యకిరణాల నుంచి జాగ్రత్తగా ఉంటాయి. సన్‌ లోషన్‌ క్రీమ్‌ లేనిదే బయట అడుగెట్టను. ఎక్కువ శాతం సముద్ర తీర ప్రాంతాల్లో గడపడం ఇష్టం. ఎలాంటి డ్రెస్‌ వేసుకున్నా సులువుగా నప్పుతుంది. హీరోయిన్‌ అయినా హోమ్‌ మేడ్‌ ఫుడ్‌, హోమ్‌ మేడ్‌ బ్యూటీ టిప్స్‌ పాటిస్తా. సూర్యరశ్మితో చర్మం కమిలిపోకుండా కీరదోసకాయ, పెరుగుతో చేసిన మిశ్రమాన్ని పట్టించుకుంటా. దీన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు. గంట తర్వాత మంచి నీళ్లతో శుభ్రపరచుకుంటే సరి. చర్మానికి ఎలాంటి హాని కలగదు. ఎక్కువశాతం మేకప్‌ లేకుండా బయటికి వెళ్తుంటా. ఆకుకూరలు, ఉడికించిన కూరగాయలు, తాజా పండ్లను తింటా. ఎక్కు వగా ఇంట్లో తయారు చేసిన ఆహారానికే నా ఓటు. మంచి ఆహారం తినటంతో పాటు కచ్చితంగా వర్కవుట్స్‌ చేస్తా.  మానసిక ఆనందం ఉంటే మరింత అందంగా కనిపిస్తాం’’

Updated Date - 2021-10-28T05:30:00+05:30 IST