జుట్టు రాలకుండా ఉండాలంటే..

ABN , First Publish Date - 2021-10-25T07:05:29+05:30 IST

అందరికి ఎదురయ్యే సమస్య జుట్టు రాలిపోవటం. జుట్టు రాలిపోవటానికి శారీరక, మానసిక, పర్యావరణ సమస్యలు కారణమని..

జుట్టు రాలకుండా ఉండాలంటే..

అందరికి ఎదురయ్యే సమస్య జుట్టు రాలిపోవటం. జుట్టు రాలిపోవటానికి శారీరక, మానసిక, పర్యావరణ సమస్యలు కారణమని నిపుణులు పేర్కొంటూ ఉంటారు. సరైన మోతాదులో పౌష్టికాహారం తింటే జుట్టురాలిపోయే సమస్యను సమర్థంగా ఎదుర్కోవచ్చని వారు సూచిస్తుంటారు. అలాంటి ఆహారపదార్థాలేమిటో చూద్దాం.


పాలకూర:

పాలకూరలో ఐరన్‌, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ, ఫోలేట్‌ వంటివి పుష్కలంగా ఉంటాయి. పాలకూరను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తింటే జుట్టురాలిపోవటం తగ్గుతుంది. వెంట్రుకలకు మెరుపు కూడా వస్తుంది. 

గుడ్లు:

కోడిగుడ్లలో ప్రొటీన్‌తో పాటుగా ఐరన్‌, బి విటమిన్‌లు కూడా ఉంటాయి. గుడ్డు సొనలో ఉండే బియోటిన్‌ అనే పదార్థాన్ని బి7 అని కూడా అంటారు. ఇది జట్టు పెరగటానికి ఎంతో దోహదపడుతుంది. జట్టు రాలకుండా అడ్డుకుంటుంది. అందువల్ల జుట్టురాలిపోతున్న వారు గుడ్లను తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

నట్స్‌ అండ్‌ సీడ్స్‌:

జీడిపప్పు, బాదంపప్పులను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తినటం వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్లు జుట్టురాలకుండా అడ్డుకుంటాయి. 

చేపలు:

కొన్ని రకాల చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినటం వల్ల జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. జుట్టు పెరగటంతో పాటుగా రాలిపోవటం కూడా తగ్గుతుంది. 

Updated Date - 2021-10-25T07:05:29+05:30 IST