గూగుల్‌ బుక్‌ మార్క్స్‌ క్లోజ్‌!

ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST

గూగుల్‌ బుక్‌మార్క్స్‌ చరిత్ర ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. పదహారేళ్ళుగా కొనసాగుతున్న ఈ సర్వీసును గూగుల్‌ నిలిపివేస్తోంది.

గూగుల్‌ బుక్‌ మార్క్స్‌ క్లోజ్‌!

గూగుల్‌ బుక్‌మార్క్స్‌ చరిత్ర ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. పదహారేళ్ళుగా కొనసాగుతున్న ఈ సర్వీసును గూగుల్‌ నిలిపివేస్తోంది. గూగుల్‌.కామ్‌/బుక్‌మార్క్స్‌లోకి వెళ్ళి ‘ఎక్స్‌పోర్ట్‌ బుక్‌మార్క్స్‌పై క్లిక్‌ చేసి తమ డేటాను వినియోగదారులు కాపీ చేసుకోవచ్చు. దీన్ని మూసేస్తే ప్రధానంగా గూగుల్‌ మ్యాప్స్‌లో స్టేర్డ్‌ లొకేషన్స్‌ విషయంలో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఈ సమాచారం విషయంలో ఇంకా స్పష్టత లేదు. 


పీసీ ఉపయోగించి గూగుల్‌ మ్యాప్‌ను కింది విధంగా సేవ్‌ చేసుకోవచ్చు.

గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేయండి

బిజినెస్‌ ప్లేస్‌ గురించి క్లిక్‌ లేదంటే సెర్చ్‌ చేయండి. లేదంటే లాంగిట్యూడ్‌, లేటట్యూడ్‌ సిగ్నల్స్‌ను క్లిక్‌ చేయండి. 

సేవ్‌ చేసి, మీ జాబితాను ఎంపిక చేసుకోండి.

వినియోగదారుడు మాత్రమే తను సేవ్‌ చేసిన ప్లేస్‌లను కనుగొనగలరు. మరెవరితోనైనా షేర్‌ చేసుకుంటేనే వాళ్ళకూ అవి కనిపిస్తాయి. 

అలాగే గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి ఎంబెడ్డెడ్‌ అయి ఉన్న మరో వెబ్‌సైట్‌ నుంచి కూడా సేవ్‌ చేసుకోవచ్చు. 

గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి ఎంబెడ్డెడ్‌ మ్యాప్స్‌ కలిగి ఉన్న వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. 

సదరు ప్రాంతాల ఉన్న సమాచారం నుంచి ప్లేస్‌ను క్లిక్‌ చేయండి. అప్పుడు సేవ్‌ చేసి జాబితా నుంచి ప్లేస్‌ను ఎంచుకోండి.

అప్పుడు మీ స్టార్‌, వెబ్‌సైట్‌ పేరు డెస్క్‌టాప్‌, మొబైల్‌పై ప్రత్యక్షమవుతాయి. 

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు సేవ్‌ చేసిన ప్లేస్‌,  డౌన్‌లోడ్‌  చేసిన ఆఫ్‌లైన్‌ ఏరియా మాదిరిగా ఉండదు. 

Updated Date - 2021-07-24T05:30:00+05:30 IST