అల్లం టీ కొడితే...
ABN , First Publish Date - 2021-08-25T05:30:00+05:30 IST
అల్లం టీ కొడితే...

అసలే కరోనా పరిస్థితులు.. అందునా వానాకాలం. ఈ మబ్బు పట్టిన వేళల్లో దగ్గు, జలుబు కూడా పట్టుకుంటోంది. ముఖ్యంగా గొంతు ఇన్‌ఫెక్షన్లు అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అల్లం టీ తాగడం మంచిదే అంటున్నారు నిపుణులు. అల్లం ఛాయ్‌లో కాసింత నిమ్మరసం, చెంచా తేనె కలపడం మరింత మంచిదేనట. ముఖ్యంగా ఈ అల్లం టీ తాగడం వల్ల గొంతులో నొప్పి, ఇతర ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. ఒంట్లో ఉండే సోమరితనం పోతుంది. అల్లం టీ తాగడం వల్ల పొట్ట ఉబ్బరం, కడుపులోని గ్యాస్ వల్ల వచ్చే నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేనా మనలో ఉండే కొవ్వుశాతం కూడా తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే కేవలం వానాకాలంలోనే కాదు ఇతర కాలాల్లో కూడా అల్లం ఛాయ్ తాగాలంటున్నారు నిపుణులు.