ఐస్‌క్యూబ్స్‌తో ముఖానికి మెరుపులు
ABN , First Publish Date - 2021-03-01T05:30:41+05:30 IST
ముఖానికి రాసుకునే సౌందర్య ఉత్పత్తులను చర్మం త్వరగా గ్రహించడానికి కూడా ఐస్ క్యూబ్స్ ఉపకరిస్తాయి. క్రీమ్ లేదా సిరమ్ వాడిన తర్వాత ముఖాన్ని ఐస్ క్యూబ్స్‌తో రుద్దితే చర్మం మెరుపులు చిందిస్తుంది
- ముఖానికి రాసుకునే సౌందర్య ఉత్పత్తులను చర్మం త్వరగా గ్రహించడానికి కూడా ఐస్ క్యూబ్స్ ఉపకరిస్తాయి. క్రీమ్ లేదా సిరమ్ వాడిన తర్వాత ముఖాన్ని ఐస్ క్యూబ్స్‌తో రుద్దితే చర్మం మెరుపులు చిందిస్తుంది.
- ఐస్ క్యూబ్స్‌ను వస్త్రంలో చుట్టి దానితో నల్లని వలయాల మీద సున్నితంగా రుద్దితే ఫలితం ఉంటుంది.
- మేకప్ వేసుకునే ముందు ఐస్ క్యూబ్ లేదా ప్యాక్స్ వాడితే మేకప్ ఎక్కువసేపు ఉంటుంది.
- పొడి పెదవులపై ఐస్ క్యూబ్స్‌ను సున్నితంగా రుద్దితే వాటిపై ఉన్న పగుళ్లు పోతాయి.
- మిల్క్ ఐస్ క్యూబ్స్‌ను చర్మంపై రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి.
- పొడివస్త్రంలో ఐస్‌క్యూబ్స్ వేసి దానితో ముఖంపై మసాజ్ చేస్తే మొటిమలు తగ్గి పోతాయి. చర్మంపై ఉండే ముడతలు పోతాయి.
- ఐస్ క్యూబ్‌తో రుద్దడం వల్ల చర్మంపై ఉండే స్వేద రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది.