డబల్‌ క్లీన్సింగ్‌ మేలు!

ABN , First Publish Date - 2021-08-21T08:01:57+05:30 IST

ముఖం ఒకసారి క్లీన్సింగ్‌ చేసుకుంటే సరిపోదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబల్‌

డబల్‌ క్లీన్సింగ్‌ మేలు!

ముఖం ఒకసారి క్లీన్సింగ్‌ చేసుకుంటే సరిపోదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబల్‌ క్లీన్సింగ్‌ అవసరం అంటున్నారు సౌందర్య నిపుణులు. డబల్‌ క్లీన్సింగ్‌ అంటే మొదట ఆయిల్‌ బేస్డ్‌ క్లీన్సర్‌తో శుభ్రం చేసి, తరువాత వాటర్‌ బేస్డ్‌ క్లీన్సర్‌ను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. మొదట ఉపయోగించే క్లీన్సర్‌ మేకప్‌, సెబమ్‌, సన్‌స్ర్కీన్‌ అవశేషాలు, ఇతర దుమ్ము, అదనంగా ఉన్న ఆయిల్‌ను తొలగించి చర్మాన్ని శుభ్రం చేస్తుంది. రెండోసారి వాడే క్లీన్సర్‌ చర్మానికి తగినంత మాయిశ్చర్‌ అందేలా చేస్తుంది. డబల్‌ క్లీన్సర్‌ వల్ల మొటిమల సమస్య కూడా దూరమవుతుంది. 


ఎలా చేయాలంటే...


 ముందుగా ఆయిల్‌ బేస్డ్‌ క్లీన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కాటన్‌ ప్యాడ్స్‌ లేదా మెత్తటి క్లాత్‌ను ఉపయోగించి క్లీన్సర్‌తో మసాజ్‌ చేస్తూ శుభ్రం చేయాలి. తరువాత నీటితో కడిగేసుకోవాలి.


 ఇప్పుడు వాటర్‌ బేస్డ్‌ క్లీన్సర్‌ను తీసుకుని మెత్తటి గుడ్డతో వేళ్లను ఉపయోగిస్తూ శుభ్రం చేసుకోవాలి. తరువాత నీళ్లతో కడిగేసుకుని పొడిగుడ్డతో తుడుచుకోవాలి.


 రాత్రి పడుకొనే ముందు డబల్‌ క్లీన్సర్‌ను ఉపయోగిస్తే మాయిశ్చర్‌ లాక్‌ అవుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. నిగారింపు సంతరించుకుంటుంది. 


 డబల్‌ క్లీన్సర్‌ను వారంలో మూడుసార్లు ఉపయోగించాలి. ఆయిల్‌ స్కిన్‌ అయితే వారానికొకసారి సరిపోతుంది. 


Updated Date - 2021-08-21T08:01:57+05:30 IST