నచ్చిన వంటకాన్ని కోరిన విధంగా తయారు చేసిచ్చే డెలీ 360
ABN , First Publish Date - 2021-07-23T05:17:33+05:30 IST
ఆతిథ్య రంగాన్ని కరోనా కకావికలం చేసిన కాలంలో ఖర్చులు తగ్గించుకుని కొంతకాలం పాటు మనుగడ సాగించాలంటే క్లౌడ్ కిచెన్ ఒక్కటే మార్గమంటున్నారు ఆతిథ్య రంగంలోని ఔత్సాహికులు.
క్లౌడ్ కిచెన్... ఇప్పుడు రెస్టారెంట్, హోటల్ సర్కిల్స్‌లో అధికంగా వినిపిస్తున్న పదం. కొంతమంది డార్క్ కిచెన్, ఘోస్ట్ కిచెన్ అంటుంటే ఇంకొంత మంది వర్ట్యువల్ కిచెన్స్, శాటిలైట్ కిచెన్స్ అని కూడా అంటున్నారు. పలికేది ఏ విధంగా ఉన్నా వీటన్నిటిలోనూ ఉండే ఒకే ఒక్క లక్షణం... ఎలాంటి డైన్ ఇన్ సదుపాయం లేకుండా డెలివరీ ఓన్లీ రెస్టారెంట్‌గా మెలగడమే!. ప్రస్తుత కాలంలో వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఉన్న అవకాశంగా చాలామంది క్లౌడ్ కిచెన్‌ను భావిస్తున్నారు. ఆతిథ్య రంగాన్ని కరోనా కకావికలం చేసిన కాలంలో ఖర్చులు తగ్గించుకుని కొంతకాలం పాటు మనుగడ సాగించాలంటే క్లౌడ్ కిచెన్ ఒక్కటే మార్గమంటున్నారు ఆతిథ్య రంగంలోని ఔత్సాహికులు.
కానీ, ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌పై రెస్టారెంట్‌ను లిస్ట్ చేసుకున్నంత సులభంగా కిచెన్ ఏర్పాటు చేయలేము. కరోనా పేరిట మౌలిక వసతుల ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత కాలంలో రిస్క్ చేయలేము. ఇలాంటి సమయంలో తాము సహాయం చేస్తామంటూ ముందు కొస్తున్నాయి కొన్ని సంస్థలు. ‘వంటకం మీది... వంటగది మాది, పేరు మీది... మీ తరపున వినియోగదారులకు అందించేది మేము’ అంటూ వినూత్న విధానంతో నగరవాసుల ముందుకొచ్చింది డెలీ 360. క్లౌడ్ కిచెన్‌కు మించి, బీ2బీ వినియోగదారులతో పాటుగా ఇటు బీ2సీ వినియోగదారులకూ సేవలనందిస్తోంది. క్లౌడ్ కిచెన్ అంటే డైన్ ఇన్ సదుపాయాలు ఉండవు, కానీ తాము ఆ సేవలను కూడా అందిస్తామంటూ సరికొత్త పంథా అనుసరిస్తోంది.
కోవిడ్–19 అందరికీ కష్టాలనే తీసుకువచ్చింది. ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. హోటల్ రంగం పరిస్థితి మరీ దారుణం. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 30 శాతానికి పైగా రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడ్డాయని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. సుప్రసిద్ధ రెస్టారెంట్ చైన్స్ కూడా నిర్వహణ ఖర్చుల భారంతో సతమతమవుతున్నాయి. ఇదే క్లౌడ్ కిచెన్లకు మార్గం సుగమం చేస్తోంది. 2019 నాటికి దేశంలో 5వేలకు పైగా క్లౌడ్ కిచెన్లు ఉన్నాయని , ప్రస్తుతం 50 నుంచి 60 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంటుంటే.. గ్రాస్ మర్చండైజ్ విలువ పరంగా 2019లో 400 మిలియన్ డాలర్లు ఉంటే 2024 నాటికి 3బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఇది నిలువనుందని అంచనా వేస్తున్నాయి మరికొన్ని సంస్థలు. ఫుడ్ అండ్ బిజినెస్ రంగంలో రాబోయేదంతా క్లౌడ్ కిచెన్ కాలమేనంటూ ఈ రంగానికి చెందిన ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ తరహా కిచెన్ల ఏర్పాటులో కొంతమంది తలమునకలయ్యారు కూడా! అయితే ప్రస్తుత పరిస్థితిల్లో ఎఫ్ అండ్ బీ రంగంలో రాణించాలంటే భారీ పెట్టుబడులు పెట్టడం కన్నా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని బ్రాండ్‌ను నిర్మించుకోవడమే బెటర్ అని అంటున్నారు డెలీ 360 వ్యవస్థాపకుడు శివ తేజేశ్వర్ రెడ్డి. తమ డెలీ 360ను బీ2బీకి సైతం సహాయపడే రీతిలో తీర్చిదిద్దామని చెబుతున్నారాయన. ‘‘మీ సొంత బ్రాండ్‌ను మీరు సృష్టించుకోవచ్చు. అదే సమయంలో మా కిచెన్ సేవలను వినియోగించుకోచ్చు. ఫుడ్ డెలివరీ కోసం మా డెలివరీ ప్లాట్‌ఫామ్‌నూ వినియోగించుకోవచ్చు. కాన్సెప్ట్ ఏదైనా అందుకనువైన కిచెన్ సేవలను మేము అందిస్తాం’’ అని చెబుతూ తమ క్లౌడ్ కిచెన్‌తో మార్కెటింగ్ అవకాశాలనూ అధికంగా అందిస్తున్నారు.
ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. ‘‘రెస్టారెంట్ల సిగ్నేచర్ రెసిపీలను కూడా ఔట్ సోర్సింగ్ చేస్తున్నాం. ఆ రెస్టారెంట్ల తరపున మేము వండినప్పటికీ రుచి పరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే, మా చెఫ్‌లు పూర్తి సుశిక్షితులు. వంటకాలలో వాడే పదార్థాల సేకరణ, ఆ వంటకాల తయారీలో వాటిని వాడే విధానం అంతా అసలైన రెస్టారెంట్‌ను అనుసరించే ఉంటుండటం వల్ల రుచి, నాణ్యత పరంగా ఎలాంటి భయమూ ఉండదు. కేవలం వ్యాపార వర్గాలకు మాత్రమే కాదు వినియోగదారులకూ వినూత్న అవకాశాలను అందిస్తుంది డెలీ 360. మీరు కోరుకోండి... మేము వండి వడ్డిస్తామంటూ ఆఫర్ చేస్తుంది. రుచి, నాణ్యత పరంగా మాత్రమే కాదు విభిన్న వంటకాలనూ రుచి చూపిస్తున్నాం’’ అన్నారు.
ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, దక్షిణ భారత, అరేబియన్, ఓరియెంటల్ రుచులను ఆఫర్ చేస్తున్న డెలీ, క్లౌడ్ కిచెన్‌లో సరికొత్త నేపథ్యాలనూ పరిచయం చేసింది. వినియోగదారులు తమ ఆహార ప్రాధాన్యతలకనుగుణంగా మీల్ ప్లాన్ ఎంచుకోవడమే కాకుండా, కోరుకున్న సమయానికి డెలివరీ పొందే అవకాశం కూడా ఉంది. అందుకు డెలీ 360 యాప్ ద్వారా సేవలు పొందవచ్చు.