విటమిన్ల లోపం...
ABN , First Publish Date - 2021-01-12T05:30:00+05:30 IST
విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాల పట్ల అవగాహన ఏర్పరుచుకుని, ఆ విటమిన్ పరిమాణాన్ని పెంచి డెఫిసియన్సీని అరికట్టాలి.

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాల పట్ల అవగాహన ఏర్పరుచుకుని, ఆ విటమిన్ పరిమాణాన్ని పెంచి డెఫిసియన్సీని అరికట్టాలి.
నోటి చివర్లలో: నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ బి12) లోపంగా భావించాలి.
చర్మం: చర్మం మీద ఎర్రని, పొట్టుతో కూడిన ర్యాషె్‌సతో పాటు, వెంట్రుకలు రాలుతూ ఉంటే నీటిలో కరిగే బయోటిన్ (విటమిన్ బి7) లోపంగా గుర్తించాలి.
తిమ్మిర్లు: అరచేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లు ఉన్నా, మొద్దుబారినా బి విటమిన్ల (ఫోలేట్, బి6, బి12) లోపమని అర్థం చేసుకోవాలి.
కండరాల నొప్పులు: కాలి బొటనవేళ్లు, పిక్కలు, పాదాలు, కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పోటాషియం లోపం ఉందని తెలుసుకోవాలి.