ఐఫోన్ డిస్ఇన్ఫెక్షన్కు క్లీనర్స్ వద్దు
ABN , First Publish Date - 2021-07-24T05:40:08+05:30 IST
ఐఫోన్ క్లీనింగ్, డిస్ఇన్ఫెక్షన్కు సంబంధించి యాపిల్ తాజాగా సూచనలు చేసింది. బ్లీచ్, హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఐఫోన్లను శుభ్రపర్చవద్దని హెచ్చరించింది.

యాపిల్ సూచనలు
ఐఫోన్ క్లీనింగ్, డిస్ఇన్ఫెక్షన్కు సంబంధించి యాపిల్ తాజాగా సూచనలు చేసింది. బ్లీచ్, హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఐఫోన్లను శుభ్రపర్చవద్దని హెచ్చరించింది. 70 శాతం ఐసోప్రోపైల్, 75 శాతం ఈథైల్ ఆల్కహాల్ లేదంటే క్లోరోక్స్తో యాపిల్ ఉత్పత్తుల పై భాగంలో శుభ్రపర్చుకోవచ్చని సూచించింది. తుంపర్లతో కూడిన స్ర్పే కూడా వద్దు. క్లీనింగ్ ఏజెంట్లతో యాపిల్ ఉత్పత్తులను ముంచేయవద్దు. నిర్దేశిత ద్రవాలను పొడి బట్ట లేదంటే తువ్వాలపై వేసుకుని తమ డివైస్లను సున్నితంగా శుభ్రపర్చుకోవాలని యాపిల్ సూచించింది.