పిల్లల విషయంలో ఇలా...

ABN , First Publish Date - 2021-11-28T08:09:51+05:30 IST

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌...కొత్త వాళ్లతో స్నేహం కోసం సోషల్‌మీడియాలో ఇప్పుడు బోలెడు ఆప్షన్లు ఉన్నాయి. ..

పిల్లల విషయంలో ఇలా...

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌...కొత్త వాళ్లతో స్నేహం కోసం సోషల్‌మీడియాలో ఇప్పుడు బోలెడు ఆప్షన్లు ఉన్నాయి. అయితే పిల్లలను సోషల్‌మీడియా ఉపయోగించుకునేందుకు అనుమతించాలా? వద్దా? అనే సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. నిజానికి సోషల్‌మీడియా వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. పిల్లలు వాటిని సరైన దారిలో వాడుతున్నారా అనే విషయంపై కన్నేసి ఉంచడమే తల్లిదండ్రులు చేయాల్సిన పని.

 రకరకాల సంస్కృతుల గురించి తెలుసుకుంటారు. వారితో స్నేహం ఏర్పరచుకుంటారు. స్నేహాలు పెంచుకోవడానికి ఇది మంచి మార్గంగా ఉపయోగపడుతుంది.

  ఏదైనా అంశానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు పనికొస్తుంది. పాజిటివ్‌ థాట్స్‌ పెరుగుతాయి. రకరకాల అంశాలపైన అవేర్‌నెస్‌ వస్తుంది.

  పిల్లలు తమ టాలెంట్‌ను ప్రదర్శించడానికి సోషల్‌ మీడియా చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. 

Updated Date - 2021-11-28T08:09:51+05:30 IST