ప్రముఖ డిజైనర్ న్యూ స్టెప్
ABN , First Publish Date - 2021-01-05T03:44:03+05:30 IST
ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని, సెలబ్రిటీలకు డిజైనింగ్ చేయాలని ప్రతి డిజైనర్ కోరుకుంటారు. ఎందరో సెలబ్రిటీలను తన క్రియేటివ్ థాట్స్‌తో మెరిసిపోయేలా చేసి.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో....

ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని, సెలబ్రిటీలకు డిజైనింగ్ చేయాలని ప్రతి డిజైనర్ కోరుకుంటారు. ఎందరో సెలబ్రిటీలను తన క్రియేటివ్ థాట్స్‌తో మెరిసిపోయేలా చేసి.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తనకు తానుగా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రముఖ డిజైనర్ చంద్రిక కంచర్ల.. ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ‘చంద్రిక కంచర్ల’ డిజైనింగ్ స్టూడియోను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం 44లో భారీవ్యయంతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రిక మాట్లాడుతూ.. నా దగ్గరకు వచ్చే క్లైయింట్స్ తాము ధరించిన బట్టలు ఎంతో బావున్నాయని ఒక మెసేజ్ చేస్తే చాలా ఆనందం పొందుతాను. అదే ఉత్సాహంతో మార్కెట్‌తో పోటీపడుతూ కొత్త ఫ్యాషన్ లను అందుబాటులోకి తీసుకురావటం నా బాధ్యతగా ఫీలవుతున్నాను. ఈ స్టోర్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్ కు సంబంధించి ఉమెన్, మేన్స్ కి స్పెషల్‌గా డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చాను అన్నారు.
ప్రముఖ యాంకర్ సుమ మాట్లాడుతూ– 'చంద్రిక డిజైన్ల'కు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆమె కలెక్షన్స్ ను నేను ఎన్నో ఏళ్లుగా యూజ్ చేస్తున్నాను. షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ టు మీ. అలాగే జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఆమెంటే నాకెంతో అభిమానం.. అన్నారు.
నటి, నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. మనం ఏది కొనుక్కోవాలన్న మొదట సెలక్షన్ ఇంపార్టెంట్. అలా ప్రతి ఒక్కరికి నచ్చే సెలక్షన్ స్టఫ్‌ని ఒకేచోట అందించటం 'చంద్రిక' స్పెషల్ అన్నారు.