క్యాల్షియం ఇలాకూడా..!
ABN , First Publish Date - 2021-08-25T05:30:00+05:30 IST
రోజూ గ్లాసు పాలు తాగితే శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. అయితే పాల పదార్థాలతోనే కాకుండా ఇతర ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా క్యాల్షియం కూడా పొందవచ్చు. ఆ పదార్థాలు ఏవంటే...

రోజూ గ్లాసు పాలు తాగితే శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. అయితే పాల
పదార్థాలతోనే కాకుండా ఇతర ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా క్యాల్షియం కూడా పొందవచ్చు. ఆ పదార్థాలు ఏవంటే...
20 గ్రాముల గసగసాలు గ్లాసు పాలతో సమానం. గసగసాలతో చేసిన డ్రింక్, డెజర్ట్, హల్వా ఏదైనా సరే డైట్‌లో ఉంటే చాలు.
30 గ్రాముల చియా విత్తనాలు ఒక గ్లాసు పాలు తాగితే అందే క్యాల్షియంను ఇస్తాయి.
నువ్వుల్లో కూడా క్యాల్షియం పాలు ఎక్కువే. రెండు టేబుల్‌స్పూన్ల నువ్వులు గ్లాసు పాలతో వచ్చే క్యాల్షియంకు సమానమైన క్యాల్షియంను అందిస్తాయి.
100 గ్రాముల కిడ్నీ బీన్స్ 140 మి.గ్రీ క్యాల్షియంను అందిస్తాయి.
బాదం పలుకులు 100 గ్రాములు తీసుకుంటే 260 మి.గ్రీ క్యాల్షియం
దొరుకుతుంది.
100 గ్రాముల టోఫు 680మి.గ్రా క్యాల్షియంను ఇస్తుంది.
ఎనిమిది అంజీర్లు తింటే 241 మి.గ్రా క్యాల్షియం అందుతుంది.
బ్రొకొలి, చిలగడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు, నారింజ పండ్లు తీసుకోవడం ద్వారా కూడా క్యాల్షి యం తగినంత లభిస్తుంది.