యోధుడికి తోడుగా..

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

కరణ్‌జోహార్‌ తన కొత్త చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. యాక్షన్‌ కథాంశంతో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి ‘యోధ’ అనే టైటిల్‌ నిర్ణయించారు....

యోధుడికి తోడుగా..

కరణ్‌జోహార్‌ తన కొత్త చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. యాక్షన్‌ కథాంశంతో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి ‘యోధ’ అనే టైటిల్‌ నిర్ణయించారు. సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఊజా ఈ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. సిద్ధార్ధ్‌ మల్హోత్రా హీరోగా నటించే ఈ చిత్రం 2022 నవంబర్‌ 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా దిశా పటానీ, రాశీ ఖన్నా పేర్లను శనివారం సోషల్‌ మీడియా వేదికగా కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. అలాగే దిశా, రాశీ ఖన్నా కూడా ‘యోధ’ పోస్టర్‌ను ట్యాగ్‌ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టింగ్స్‌ పెట్టారు. ‘ఈ యాక్షన్‌ ఫిల్మ్‌లో నేనూ భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని దిశా అంటే, ‘ ఒక మంచి సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. నా పేరు అనౌన్స్‌ చేయగానే చాలా ఎక్సైటింగ్‌గా ఫీలయ్యా’ అని రాశీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST