బరువు తగ్గాలంటే..
ABN , First Publish Date - 2021-11-24T09:34:11+05:30 IST
శరీరంలో కొవ్వుశాతం తగ్గించుకోవాలంటే ఈ చిన్నపాటి చిట్కాని పాటిస్తే చాలు. .....
శరీరంలో కొవ్వుశాతం తగ్గించుకోవాలంటే ఈ చిన్నపాటి చిట్కాని పాటిస్తే చాలు. దీనికేమీ విపరీతంగా పని చేయనక్కర్లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ ఉండవు. సులువుగానే ఇంట్లో చేసుకోవచ్చు.
నీళ్లు, రెండు నిమ్మకాయలు, అల్లం ముక్క.. ఇవి ఉంటే చాలు! మీ ఒంట్లో ఫ్యాట్ ఇట్లే కరిగించేయవచ్చు. ముందుగా ఒకటిన్నర లీటర్ మంచి నీటిని ఓ పాత్రలో తీసుకుని వేడి చేయాలి. వెంటనే నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసి (విత్తనాలు తీసేయాలి) అందులో వేయాలి. ఆ వెంటనే అల్లం ముక్కనూ అందులో వేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో పొంగులా వస్తే ఆ నిమ్మకాయ రసం, అల్లం రసం నీటిలో కలిసిపోయినట్లు. వేడి నీటిని చల్లార్చి ఒక గ్లాసు తాగితే చాలు శరీరంలోని కొవ్వు శాతం కరిగిపోతుంది. రోజూ గంట పాటు వాకింగ్‌తో పాటు బ్యాలెన్స్ డైట్‌ను పాటిస్తూ.. ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మ, అల్లం ఉడికిన ఈ నీటిని తాగటం వల్ల ఎక్కువ ఆకలి కాదు. ?