ఎక్కడున్నా భారతీయ ఆత్మనే!

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

హలీవుడ్‌ వెళ్లినా.. అమెరికాలో ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా పుట్టినదేశమే ఇష్టం. నేను ఇండియా బయటే ఉండొచ్చు కానీ నానుంచి మాత్రం ఇండియాను వేరు చేయలేరు....

ఎక్కడున్నా భారతీయ ఆత్మనే!

హలీవుడ్‌ వెళ్లినా.. అమెరికాలో ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా పుట్టినదేశమే ఇష్టం. నేను ఇండియా బయటే ఉండొచ్చు కానీ నానుంచి మాత్రం ఇండియాను వేరు చేయలేరు. ఇది ముమ్మాటికీ నిజం. ఏ దేశానికెళ్లినా భారతీయ ఆచారాల్ని, సంప్రదాయాల్ని మర్చిపోను. ఇక్కడే నా మూలాలున్నాయి. ఎక్కడున్నా భారతీయ ఆత్మనే నాది. ఎప్పుడూ నా ఇల్లు నాతోనే ఉంటుంది. మా ఇంటి దగ్గర ఉండే మందిరం నాతోనే ఉన్న భావన. మా అమ్మ నాతోనే ఉంటుంది. అందుకే ఇబ్బందిగా ఫీలవ్వను. ఇకపోతే బాలీవుడ్‌, హాలీవుడ్‌ రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తా. ఫరాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో కత్రినా, అలియాతో కలిసి నటించటానికి ఒప్పుకున్నా. హాలీవుడ్‌ సినిమాలు, బ్రాండ్స్‌తో బిజీగా ఉన్నా. నా భర్త నిక్‌ కూడా ఇటీవలే చికెన్‌ అండ్‌ బిస్కెట్‌ ప్రొడక్షన్‌ టీమ్‌లో చేరారు. ఇలా ఎవరికీ వాళ్లం బిజీ ఉన్నాం. 


ఇరవయ్యేళ్ల తర్వాత...

కరోనా తర్వాత నాతో నేను ఉండాలనిపిస్తోంది. నాకోసం చాలా సమయాన్ని కేటాయించుకోవాలి.  ఎందుకంటే ఇరవై ఏళ్ల నుంచీ కెరీర్‌లో బిజీగా ఉన్నా. ఒక్కసారిగా ప్యాండమిక్‌ పరిస్థితులొచ్చాక జీవితమేంటో అర్థమైంది. ఇల్లు, ఇంట్లో పప్పీలతో ఆడుకుంటూ హాయిగా గడిపా. ‘అన్‌ఫినిష్‌డ్‌’ అనే ఆడియో పుస్తకం కోసం పనిచేశా. ముఖ్యంగా నా గురించి ఎంతో ఆలోచించా. ఒత్తిడికి లోనవ్వటం, ఒంటరితనం ఇబ్బందే. ప్యాండమిక్‌ సమయంలో ఎమోషనల్‌ అయ్యా. 


ఆ విషయంలో అదృష్టవంతురాల్ని...

 కుటుంబంతోనే ఎక్కువ సమయం గడపటానికి కేటాయిస్తా. నిక్‌ నాకోసమే లండన్‌లో మంచి ట్రిప్స్‌ ప్లాన్‌ చేశారు. నిక్‌ చాలా మంచోడు. అతని ప్రేమ దక్కడం అదృష్టం. తను మాట్లాడితే నో చెప్పటం కష్టం. అర్థంచేసుకుంటాడు. మంచి జోక్స్‌ వేస్తాడు. ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి.. హాలీవుడ్‌కి వెళ్లాక ఇక్కడ అభిమానులను మిస్‌ అవుతున్నా. తప్పదు మరి!  ఎక్కడున్నా.. భారతీయురాలినే. ఇక్కడే నా మనసంతా తిరుగుతుంటుంది.  

Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST