కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్‌తో అందం

ABN , First Publish Date - 2021-09-02T07:34:56+05:30 IST

సున్నితమైన లేదా పొడి చర్మాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం అవసరం. ఈ చర్మాలకు కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్‌ తగినంత రక్షణ అందిస్తాయి.

కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్‌తో అందం

సున్నితమైన లేదా పొడి చర్మాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం అవసరం. ఈ చర్మాలకు కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్‌ తగినంత రక్షణ అందిస్తాయి. చర్మం మృదుత్వాన్ని కాపాడుతూ తేమ కోల్పోకుండా సంరక్షించటంలో కోల్డ్‌ ప్రెస్డ్‌ అయిల్స్‌ ఉత్తమమైనవి.


కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్‌ అంటే?

చల్లని వాతావరణంలో విత్తనాలు, నట్స్‌ నుంచి తీసే నూనెను కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌ అంటారు. ఈ నూనెల్లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఉండవు. ఇతరత్రా విషపూరిత రసాయనాలు కూడా ఉండవు. రసాయనాలతో పని లేకుండా నూనె తీసే పద్ధతి అనుసరించి సేకరించడం మూలంగా ఈ నూనెల ధర కొంత ఎక్కువగానే ఉంటుంది.


ఈ నూనెలు మేలైనవి

క్లిష్టమైన పద్ధతులు ఉపయోగించటం వల్ల తయారయ్యే నూనె తక్కువ మొత్తంలో ఉన్నా ఎంతో నాణ్యత కలిగి ఉంటుంది. సహజసిద్ధమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, సువాసనలు ఈ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ పద్ధతిలో కాకుండా రసాయనాలు, వేడిని ఉపయోగించి తీసే నూనెల్లో సహజ గుణాలు లోపిస్తాయి. ఈ నూనెలు తక్కువ కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి ఎండ తగలని ప్రాంతంలో నిల్వ ఉంచి సాధ్యమైనంత త్వరగా ఉపయోగించాలి.


కొబ్బరి నూనె

చర్మానికి కొబ్బరినూనె తేమనందిస్తుంది. కోల్డ్‌ ప్రెస్డ్‌ ప్రాసెస్‌లో తయారైన కొబ్బరి నూనె చర్మానికి రెండింతల మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు చర్మంలోకి ఇంకి ముడతలు మటుమాయం చేయటంతోపాటు చర్మాన్ని నునుపుగా మారుస్తాయి.

Updated Date - 2021-09-02T07:34:56+05:30 IST