నెయ్యితో నిగారింపు!
ABN , First Publish Date - 2021-03-18T05:31:20+05:30 IST
నెయ్యిని కొందరు ఇష్టంగా తింటారు. కొందరు మాత్రం అసలు ఇష్టపడరు. అయితే నెయ్యితో కలిగే బ్యూటీ బెనిఫిట్స్ గురించి తెలిస్తే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అవేమిటంటే..

నెయ్యిని కొందరు ఇష్టంగా తింటారు. కొందరు మాత్రం అసలు ఇష్టపడరు. అయితే నెయ్యితో కలిగే బ్యూటీ బెనిఫిట్స్ గురించి తెలిస్తే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అవేమిటంటే..
- పొడి చర్మం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సీజన్‌తో సంబంధం లేకుండా డ్రై స్కిన్‌తో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వాళ్లు కొన్ని చుక్కల నెయ్యిని చర్మంపై రాసుకుని కాసేపు సాజ్ చేసి వదిలేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల పొడి చర్మం సమస్య దూరమవుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.
- నెయ్యిని ఆహారంతోపాటు తీసుకుంటే చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఉండే విటమిన్-ఇ వయసు పైబడిన లక్షణాలను దరిచేరకుండా చూస్తుంది. అంతేకాదు చర్మం ముడతలు పడకుండా ఉండడంలోనూ నెయ్యి తోడ్పడుతుంది.
- బాత్ ఆయిల్‌గానూ నెయ్యిని ఉపయోగించవచ్చు. 5 టేబుల్స్పూన్ల నెయ్యి తీసుకుని అందులో పది చుక్కలు మీకిష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొన్ని చుక్కలు స్నానం చేసిన తరువాత ఒంటికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
- కళ్లు అలసటగా ఉంటే కొన్ని చుక్కల నెయ్యిని కళ్ల చుట్టూ రాసుకుని నెమ్మదిగా మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది. నెయ్యిని పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.