ఇలా దుర్వాసన మాయం!

ABN , First Publish Date - 2021-12-08T05:30:00+05:30 IST

ఇంట్లో దుర్వాసనలను చిటికెలో తరిమికొట్టగలిగే ఉపాయాలున్నాయి. అవేంటంటే.......

ఇలా దుర్వాసన మాయం!

ఇంట్లో దుర్వాసనలను చిటికెలో తరిమికొట్టగలిగే ఉపాయాలున్నాయి. అవేంటంటే...

చెత్త డబ్బా: ఐస్‌ ట్రేలో వెనిగర్‌ నింపి, నిమ్మ చెక్కలను వేసి, ఫ్రీజర్‌లో గడ్డ కట్టించాలి. ఈ ఐస్‌ ముక్కను చెత్త డబ్బాలో వేస్తే దుర్వాసన మటుమాయం అవుతుంది.

టవల్స్‌: టవల్స్‌ నుంచి ముక్క వాసన వదలాలంటే, వెనిగర్‌ కలిపిన వేడినీళ్లలో టవళ్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉతికి ఆరబెడితే దుర్వాసన వదులుతుంది.

ఫంగస్‌: వాష్‌ రూమ్‌లో గోడలకు ఫంగస్‌ పడితే, కప్పు వెనిగర్‌లో 25 చుక్కల లెమన్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌, 35 చుక్కల టీట్రీ ఆయిల్‌లు కలిపి, స్ర్పే బాటిల్‌లో పోసి మోల్డ్‌, ఫంగస్‌లు ఉన్న చోట స్ర్పే చేయాలి.

బూట్లు: బేకింగ్‌ సోడా చల్లి, రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయానికి దుర్వాసన తొలగిపోతుంది. పాదాలకు చమట పట్టే తత్వం ఉన్నవాళ్లు, షూలో బేకింగ్‌ సోడా చల్లుకుని, ధరించాలి. 

కార్పెట్లు, సోఫాలు: ఒక కప్పు బేకింగ్‌ సోడా, అర కప్పు కార్న్‌స్టార్చ్‌, 6 బిరియానీ ఆకులు, 2 టీస్పూన్ల లవంగ పొడి, 2 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, 10 చుక్కల పెప్పర్‌మింట్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌... వీటన్నింటినీ బ్లెండ్‌ చేసి, గాలి చొరబడని డబ్బాలో నింపుకోవాలి. ఈ పొడిని దుర్వాసన వెదజల్లే సోఫాలు, కార్పెట్ల మీద సమంగా చల్లి, నాలుగు గంటల పాటు వదిలేయాలి. తర్వాత వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో తొలగిస్తే, దుర్వాసనలు వదిలిపోతాయి.

Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST