అనూహ్య ఏకాదశి

ABN , First Publish Date - 2021-03-14T06:04:15+05:30 IST

సందీప్‌ మద్దూరు (దీపు)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రవి కనగాల నిర్మిస్తున్న చిత్రం ‘తొలి ఏకాదశి’. మహాశివరాత్రి సందర్భంగా గురువారం పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించారు

అనూహ్య ఏకాదశి

సందీప్‌ మద్దూరు (దీపు)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రవి కనగాల నిర్మిస్తున్న చిత్రం ‘తొలి ఏకాదశి’. మహాశివరాత్రి సందర్భంగా గురువారం పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సి. కల్యాణ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టైటిల్‌ చూసి ఆధ్యాత్మిక చిత్రమని అనుకోవద్దు. తొలి ఏకాదశి రోజున జరిగిన అనూహ్య సంఘటనల సమాహారంగా దీపు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు’’ అని చెప్పారు. సుమిత్‌ రామ్‌, సాయి నివాస్‌, సాయి రాజ్‌, మమతా నారాయణ్‌, వాణి, సాహితి దాసరి, నాగమణి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్వహణ: గిరిధర్‌ శ్రీరామగిరి.

Updated Date - 2021-03-14T06:04:15+05:30 IST