లాక్‌డౌన్‌తో బోసిపోయిన వీధులు

ABN , First Publish Date - 2021-05-02T15:35:01+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నాల్గవరోజు విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలు

లాక్‌డౌన్‌తో బోసిపోయిన వీధులు

- ఆంక్షలను కఠినతరం చేసిన పోలీసులు

- నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా


బళ్లారి(కర్ణాటక): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నాల్గవరోజు విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలు కొనేందుకు వీలు కల్పించారు. అనంతరం లాక్‌డౌన్‌ ఆంక్షలను పోలీసులు అమలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో తిరుగుతున్న వారిపై పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ప్రధాన వీధుల్లో తిరుగుతూ హోటళ్లు, వాణిజ్య సముదాయాలను పోలీసులు మూయించారు. తోపుడుబండ్ల వ్యాపారులను పంపించివేశారు. అత్యవసర సేవలకు సంబంధించి మాత్రమే అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత ఉద్యోగుల ఐడీలను చూపి పోలీసులు వారిని అనుమతించారు. లాక్‌డౌన్‌తో వీధులన్నీ బోసిపోయాయి. 


కంప్లి:  కంప్లి, కురుగోడు పట్టణాలలో కర్ఫ్యూ నిబంధనలను పాటిస్తూ అధికారులు పె ట్టిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లోనే వుంటున్నారు. కంప్లి, కురుగోడు పట్టణాల్లో పోలీసు అధికారులు అనవసరంగా బయటకు వచ్చిన వారికి జరిమానా వి ధిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ నిబంధనలను చిన్నపాటి వ్యాపారస్తులకు జీవనం గడిచేది కష్టంగా వుందని, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గం టల వరకైనా సమయం ఇవ్వాలని కోరారు. లాక్‌డౌన్‌లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అవకాశం కల్పించడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 


దుకాణదారుడికి రూ. 15 వేలు జరిమానా 

కొవిడ్‌ నిబంధన పాటించని శ్రీశారీమందిర్‌ యాజమాన్యానికి శనివారం రూ. 15 వేలు జరిమానా విధించారు. పట్టణంలోని కొట్టాలరోడ్డులో ఉన్న శ్రీశారీమందిర్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు కొనసాగిస్తుండటంతో జరిమానా విధించినట్లు ముఖ్య అధికారి రమేష్‌ బడిగేర్‌ తెలిపారు. అదేవిధంగా మాస్కులు ధరించని 620 మందికి జరిమానా వేసినట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలను పాటించని వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. దాడుల్లో ఆయనతోపాటు ప్రకాష్‌ బాబు, రంజిత్‌, గణేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-02T15:35:01+05:30 IST