మా పొట్ట కొట్టొద్దు!
ABN , First Publish Date - 2021-10-25T14:41:24+05:30 IST
గ్రామ సచివాలయాల్లో..

గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు డాక్యుమెంట్లు రాసే బాధ్యత అప్పగించాలి
రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంఘం విజ్ఞప్తి
విజయవాడ(ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో తమ పొట్ట కొట్టొద్దని డాక్యుమెంట్ రైటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్‌లోని కందుకూరి కళ్యాణ మండపంలో ఏపీ డాక్యుమెంట్ రైటర్ల సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశంపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. ఇదే క్రమంలో డాక్యుమెంట్లు రాసే బాధ్యతలను తమకే అప్పగించాలని డాక్యుమెంట్ రైటర్లు కోరారు.