ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద బాలికలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ

ABN , First Publish Date - 2021-12-30T21:45:31+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద బాలికలకు వృత్తి విద్యా కోర్సుల శిక్షణను స్కూలు స్థాయిలోనే ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందేందుకు కృషి చేస్తానని..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద బాలికలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 29: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద బాలికలకు వృత్తి విద్యా కోర్సుల శిక్షణను స్కూలు స్థాయిలోనే ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందేందుకు కృషి చేస్తానని సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అదనపు కో–ఆర్డినేటర్‌ పి.శ్యామ్‌సుందర్‌ అన్నారు. ఏపీసీగా జిల్లాకు బదిలీపై నియమితులైన ఆయన బుధవారం ఏలూరు ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో బాధ్య తలు చేపట్టారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించి ప్రాజెక్టు కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లా డుతూ మారుతున్న ప్రాజెక్టు ప్రాధామ్యాలు, విద్యాభివృద్ధి కార్యక్రమాలపై టీచర్ల కు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తామన్నారు. తొలుత కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, డీఈ వో సి.వి.రేణుకను మర్యాదపూర్వకంగా కలుసుకుని తన నియామక పత్రాలను అందజేశారు. ఏపీసీ బాధ్యతలు చేపట్టిన శ్యామ్‌సుందర్‌కు ఎస్‌ఎస్‌ఏ జిల్లా కార్యాలయ సెక్టోరల్‌, అసిస్టెంట్‌ సెక్టోరల్‌ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-12-30T21:45:31+05:30 IST