Good News: ‘ఉద్యోగుల’కు దీపావళి బోనస్
ABN , First Publish Date - 2021-10-20T13:59:14+05:30 IST
ఉద్యోగులకు దీపావళి..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గ్రూప్-సి. గ్రూప్-బి నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు తాత్కాలిక బోనస్‌ను ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. 30 రోజుల సగటు వేతనానికి సమానంగా బోనస్ ఇస్తారు. ప్రతి ఉద్యోగికి కనీసం రూ.6,908 బోన్‌సగా లభించే అవకాశం ఉంది. పనితీరు ఆధారంగా అందించే బోనస్ స్కీమ్‌ల ద్వారా లబ్ధి పొందని ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.