PRC నివేదికను తక్షణం బయటపెట్టాలి

ABN , First Publish Date - 2021-12-08T14:16:39+05:30 IST

పీఆర్‌సీ నివేదికను ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని ఏపీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు..

PRC నివేదికను తక్షణం బయటపెట్టాలి

ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి డిమాండ్‌


విశాఖపట్నం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీ నివేదికను ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని ఏపీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఉద్యమంపై జిల్లాల వారీగా ప్రచారం చేయడానికి మంగళవారం విశాఖపట్నం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాము 50ు ఫిట్‌మెంట్‌ కోరామని, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో 30ు హెచ్‌ఆర్‌ఏ డిమాండ్‌ చేశామన్నారు. మొత్తం 71 డిమాండ్ల తో ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు. పీఆర్‌సీని అక్టోబరు నెలాఖరుకే ఇస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని, ఇప్పుడు డిసెంబరు వచ్చేసినా మాట్లాడడం లేదని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1న జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు ఆందోళన చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. అనంతరం, కాకినాడలో ఏపీ జేఏసీ-ఏపీ జేఏసీ అమరావతి సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో బండి శ్రీనివాసరావు మాట్లాడా రు. సీఎం జగన్‌ ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వాన్ని ఆకట్టుకోవాలని దొంగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ఏపీ జేఏసీ చైర్మన్‌ జి. రామ్మోహన్‌రావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ పి.త్రినాథరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T14:16:39+05:30 IST