దేశంలోనే మొదటి రివర్స్ పీఆర్‌సీ: Ashok Babu
ABN , First Publish Date - 2021-12-15T15:26:58+05:30 IST
దేశంలో మొదటి రివర్స్..

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): దేశంలో మొదటి రివర్స్ పీఆర్‌సీని రాష్ట్రంలో చూస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు ఎద్దేవా చేశారు. ‘ప్రభుత్వం మనసులో ఏం ఉందో దానినే సీఎస్ తన నివేదికలో పేర్కొన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఇచ్చింది. అది కూడా ఇవ్వలేకపోతే ఫిట్‌మెంట్ ఇచ్చిన 27 శాతం కొనసాగిస్తామని చెప్పి ఉండాల్సింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.