రాష్ట్రంలో రెసిడెన్షియల్‌ స్కూళ్లలో టీచర్‌ ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-03-30T17:07:22+05:30 IST

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల(ఈఎంఆర్‌ఎ్‌స)ల్లో టీచింగ్‌ పో స్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మొత్తం 3,479 పోస్టులు ఉండగా అందులో తెలంగాణ లో 262

రాష్ట్రంలో రెసిడెన్షియల్‌ స్కూళ్లలో టీచర్‌ ఉద్యోగాలు

262 పోస్టుల భర్తీకి దరఖాస్తులు

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల(ఈఎంఆర్‌ఎ్‌స)ల్లో టీచింగ్‌ పో స్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మొత్తం 3,479 పోస్టులు ఉండగా అందులో తెలంగాణ లో 262 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) పోస్టులను భర్తీ చేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష జూన్‌ మొదటి వా రంలో నిర్వహిస్తారు. పోస్టులు, విద్యార్హత, అనుభవం  తదితర  సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌ https://tribal.nic.in లో పొందుపర్చారు.

Updated Date - 2021-03-30T17:07:22+05:30 IST