IIIT ప్రవేశాల్లో సర్కారీ స్కూళ్ల విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-07T13:34:11+05:30 IST

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో..

IIIT ప్రవేశాల్లో సర్కారీ స్కూళ్ల విద్యార్థుల ప్రతిభ

1, 2 సహా తొలి 10 ర్యాంకుల్లో 8 వారికే....

ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలను విడుదల చేసిన

మంత్రులు సురేశ్‌, బాలినేని, అధికారులు


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌): ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సత్తా చాటారు. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4,400 సీట్లకు పరీక్ష నిర్వహించాచగా 71,207 మంది విద్యార్థులు రాశారు. బుధవారం ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్‌ మాట్లాడుతూ.. ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను కేవలం పదిరోజుల్లోనే ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అన్ని ట్రిపుల్‌ ఐటీల్లో విద్యార్థుల కోసం ఇంక్యుబేషన్‌ సెంటర్లు, నాన్‌టెక్నికల్‌ విద్యార్థుల కోసం ఇంటర్న్‌షి్‌పలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం జగన్‌ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ చాన్సలర్‌ కేసీ రెడ్డి, వీసీ హేమచంద్రారెడ్డి, ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ జయరామిరెడ్డి పాల్గొన్నారు.


తొలి 10 ర్యాంకులు వీరికే..

మద్దన గుణశేఖర్‌(1) అనంతపురం(ఎ్‌సపీఎ్‌సఎం బాలుర హైస్కూల్‌), పి. శ్రీచక్రధరణి(2) కడప(ఏపీమోడల్‌ స్కూలు), ఎం.చంద్రిక(3) విజయనగరం(జడ్పీ హైస్కూలు), కె. వెంకటసాయిసుభాశ్‌(4) కడప (జడ్పీ హైస్కూలు), జి.మనోజ్ఞ(5) తూర్పుగోదావరి(జడ్పీ హైస్కూలు), ఎస్‌.శ్రీదేదీప్య(6) విశాఖ(నవోదయ), గూడా యశ్వంతరెడ్డి(7) ప్రకాశం(ప్రైవేటు స్కూల్‌), సుధామఽధురిమ(8), నెల్లూరు(ప్రైవేటు స్కూల్‌), సీహెచ్‌ వంశీకృష్ణ(9) అనంతపురం(మున్సిపల్‌ హైస్కూలు), శేషసురేశ్‌(10) తూర్పుగోదావరి(మున్సిపల్‌ హైస్కూలు). కాగా, వివిధ స్థాయిల్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు 54 ర్యాంకులు సాధించారు.

Updated Date - 2021-10-07T13:34:11+05:30 IST