మే 15 నుంచి వేసవి సెలవులు
ABN , First Publish Date - 2021-03-24T16:03:41+05:30 IST
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మే 15 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి, సమ్మేటివ్ అసె్‌సమెంట్(ఎ్‌సఏ) కోసం ప్రిపరేషన్, మే 1-10 తేదీల్లో సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు

1-9 తరగతుల విద్యార్థులకు మాత్రమే
పదో తరగతి విద్యార్థులు, టీచర్లకు సెలవుల్లేవు!
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మే 15 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి, సమ్మేటివ్ అసె్‌సమెంట్(ఎ్‌సఏ) కోసం ప్రిపరేషన్, మే 1-10 తేదీల్లో సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్‌లోడింగ్, ప్రమోషన్ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి, మే 1 నుంచి 16 వరకు ప్రీఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్, మే 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, మే 25 నుంచి జూన్ 6 వరకు ఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్, జూన్ 7 నుంచి 16 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్ విడుదల చేసింది. దీన్ని బట్టి టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేనట్టు స్పష్టమవుతోంది.