విద్యార్థులను పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయాలి
ABN , First Publish Date - 2021-12-30T21:04:55+05:30 IST
ద్యార్థులను పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని

మంత్రి కేటీఆర్ సూచన
వికారాబాద్ : విద్యార్థులను పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని ఏకేఆర్ స్టడీ సర్కిల్-2022 క్యాలెండర్‌ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, తెలంగాణ వెటర్నరీ గ్యాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌లతో కలిసి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత కొంతకాలంగా నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చిన సంస్థగా ఏకేఆర్ కొనసాగుతోందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికోసం వికారాబాద్‌లో సంస్థను స్థాపించి, తెలుగు రాష్ట్రాలలోని అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే పోటీ పరీక్షలకు శిక్షణనిస్తూ.. వారి అభివృద్ధికి దోహదపడుతున్న ఏకేఆర్ డైరెక్టర్ రమణను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ముచ్చటించి, ఇప్పటినుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు.