షోకాజ్‌ నోటీసులు ఉపసంహరించాలి

ABN , First Publish Date - 2021-11-09T16:09:50+05:30 IST

మధ్యాహ్న భోజన పథకంలో..

షోకాజ్‌ నోటీసులు ఉపసంహరించాలి

కడప(ఎడ్యుకేషన్‌), నవంబరు 8: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు, చిక్కీలు సకాలంలో సరఫరా చేయని ఏజెన్సీలను వదిలిపెట్టి, రాయలసీమ నాలుగు జిల్లాలలోని దాదాపు 2,000 మంది ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్జేడీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే ఉపాధ్యాయులపై వృత్తిపరంగా అనేక ఒత్తిళ్లు ఉన్నాయని, ప్రభుత్వం, అధికారులు సానుభూతితో వ్యవహరించి పనిఒత్తిడిని తగ్గించాలని కోరారు. సంఘం కడప జిల్లా అధ్యక్షుడు జయరాంరెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చెంగల్‌రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగసుబ్బరాయుడు, ఇతర ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T16:09:50+05:30 IST