సివిల్స్‌ సాధకులకు ‘తక్షశిల’ స్కాలర్‌షిప్పులు

ABN , First Publish Date - 2021-06-22T14:59:14+05:30 IST

సివిల్స్‌ సాధనే లక్ష్యంగా ఉన్న విద్యార్థులకు ‘తక్షశిల’ ఐఏఎస్‌ అకాడమి రూ.50 లక్షల విలువైన ఉపకార వేతనాలు అందిస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్‌ బీఎ్‌సఎన్‌ దుర్గాప్రసాద్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌.నాగేశ్వరరావు(మాజీ ఐఏఎస్‌ అధికారి) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కాలర్‌షిప్‌

సివిల్స్‌ సాధకులకు ‘తక్షశిల’ స్కాలర్‌షిప్పులు

అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): సివిల్స్‌ సాధనే లక్ష్యంగా ఉన్న విద్యార్థులకు ‘తక్షశిల’ ఐఏఎస్‌ అకాడమి రూ.50 లక్షల విలువైన ఉపకార వేతనాలు అందిస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్‌ బీఎ్‌సఎన్‌ దుర్గాప్రసాద్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌.నాగేశ్వరరావు(మాజీ ఐఏఎస్‌ అధికారి) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కాలర్‌షిప్‌ అండ్‌ రివార్డ్‌ ఎగ్జామ్‌(స్కోర్‌) పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ క్యాంప్‌సలలో ప్రవేశాల కోసం ఈ నెల 26న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. పదో తరగతి మొదటి శ్రేణితో ఉత్తీర్ణత సాధించిన వారు ఇంటర్‌, డిగ్రీ, సివిల్స్‌ శిక్షణతో కలిపి ఆరేళ్లు,.. ఇంటర్‌ పూర్తి చేసిన వారు డిగ్రీ, సివిల్స్‌ శిక్షణతో నాలుగేళ్ల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. రెండు విభాగాలకు వేర్వేరుగా తొలి మూడు స్థానాలు సాధించిన వారికి పూర్తిగా ఉచిత బోధన అందిస్తామని తెలిపారు. 4-12 ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం, 13-25 ర్యాంకులు పొందిన వారికి 25 శాతం ఫీజు రాయితీ వర్తిస్తుందని వివరించారు. ఈ నెల 26న ఉదయం 10  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని, ఈ నెల 25 లోపు తక్షశిల ఐఏఎస్‌ అకాడమీ వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-06-22T14:59:14+05:30 IST