తెలుగును రక్షించండి

ABN , First Publish Date - 2021-02-05T16:00:02+05:30 IST

తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషా విశ్వవిద్యాలయంలో కలపకుండా, ప్రత్యేక ప్రతిపత్తితో కొనసాగించేటట్లు చూడాలని తెలుగు ఆచార్యుల బృందం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేసింది

తెలుగును రక్షించండి

ఉప రాష్ట్రపతికి తెలుగు ఆచార్యుల వినతి

చెన్నై, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషా విశ్వవిద్యాలయంలో కలపకుండా, ప్రత్యేక ప్రతిపత్తితో కొనసాగించేటట్లు చూడాలని తెలుగు ఆచార్యుల బృందం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేసింది. మద్రాస్‌  విశ్వవిద్యాలయ తెలుగుశాఖ మాజీ అధ్యక్షులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌తో కూడిన ఆచార్యుల బృందం గురువారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతికి వినతిపత్రం అందజేసింది. అలాగే తమిళనాడులో నిర్బంధ తమిళం వల్ల తెలుగు భాష చదువుకోవడానికి అవకాశం లేకుండాపోతోందని, ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని, రైల్వే, బ్యాంకు తదితర పోటీ పరీక్ష పత్రాలను తెలుగు భాషలో కూడా ఇచ్చేలా చూడాలని కోరారు. దీనిపె వెంకయ్య సానుకూలంగా స్పందించారు.  


Updated Date - 2021-02-05T16:00:02+05:30 IST