ప్రైవేటు టీచర్లను ఆదుకోండి: ఉపాధ్యాయ సంఘాలు

ABN , First Publish Date - 2021-05-08T15:42:46+05:30 IST

కొవిడ్‌ - 19 కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలు సరిగ్గా నడవడం లేదని, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు సక్రమగా అందడం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు

ప్రైవేటు టీచర్లను ఆదుకోండి: ఉపాధ్యాయ సంఘాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ - 19 కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలు సరిగ్గా నడవడం లేదని,  ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు సక్రమగా అందడం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు నెలకు కనీసం రూ.5,000 చొప్పున ఇచ్చి ఆదుకోవాలంటూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. దీనికితోడు ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో ఆయా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు రూ.5,000 చొప్పున వేసేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రైవేట్‌ కుటుంబాల దుస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం కొంతమేర ఆదుకునే ప్రయత్నం చేస్తోందని,  జగన్‌ సర్కార్‌ కూడా  ఆదుకోవాలని కోరుతున్నాయి.  


3 నెలలుగా జీతాల్లేని పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు

రాష్ట్రంలోని మున్సిపల్‌ పాఠశాలల్లో పారిశుద్ధ్య విధులను నిర్వర్తిస్తున్న కార్మికులకు గత 3 మాసాలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు.  వీరికి నెలకు రూ.6,000 చొప్పున, వేసవి సెలవుల్లో సైతం నెలకు రూ.4,000 చొప్పున ఇస్తామంటూ కొన్ని నెలల క్రితమే ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘అమ్మ ఒడి’ కింద విద్యార్థుల తల్లులకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.15,000లలో రూ.1,000 చొప్పున (వారు చదువుతున్న పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్మికులకు వేతనంగా ఇచ్చేందుకుగాను) సంబంధిత జిల్లా కలెక్టర్ల దగ్గర ఉంచారు. ఆ నిధులు అందుబాటులోనే ఉన్నప్పటికీ వేతనాలు నెలల తరబడి ఇవ్వకపోవడమెందుకో అర్థం కావడం లేదని కార్మికులు వాపోతున్నారు.  

Updated Date - 2021-05-08T15:42:46+05:30 IST