ప్రైమరీ టీచర్లకు శిక్షణ: మంత్రి సురేశ్‌

ABN , First Publish Date - 2021-06-22T15:08:00+05:30 IST

‘సమగ్రశిక్ష’ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రైమరీ టీచర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో సీబీఎ్‌సఈ విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీచర్లకు శిక్షణ

ప్రైమరీ టీచర్లకు శిక్షణ: మంత్రి సురేశ్‌

అమరావతి , జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘సమగ్రశిక్ష’ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రైమరీ టీచర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో సీబీఎ్‌సఈ విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీచర్లకు శిక్షణ కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోమవారం ఈ కార్యక్రమాన్ని దీక్షా పోర్టల్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, పేదరికాన్ని పారదోలడానికి విద్య ఒక్కటే సాధనమనేది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-22T15:08:00+05:30 IST