పేదరికాన్ని జయించాలంటే విద్యే ఏకైక మార్గం

ABN , First Publish Date - 2021-12-31T21:14:25+05:30 IST

పేదరికాన్ని జయించాలంటే విద్య ఏకైక మార్గమని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నారు. భాషోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని వెల్లటూరు, నందిమండలం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో

పేదరికాన్ని జయించాలంటే విద్యే ఏకైక మార్గం

కడప, పెండ్లిమర్రి డిసెంబరు 30: పేదరికాన్ని జయించాలంటే విద్య ఏకైక మార్గమని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నారు. భాషోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని వెల్లటూరు, నందిమండలం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లటూరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుభాష గొప్పతనం, ప్రముఖ తెలుగు కవుల గురించి పిల్లలకు వివరించారు. జాతీయ విద్యావిధానం అమలు తీరును ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో సుజాత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T21:14:25+05:30 IST