పాలిటెక్నిక్‌ ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2021-07-20T16:11:48+05:30 IST

పాలిటెక్నిక్‌ ఫలితాలను సాంకేతిక విద్యామండలి అధికారులు సోమవారం వెల్లడించారు. మొత్తంగా 11వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, క్రెడిట్ల ప్రకారం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కరోనాతో పాలిటెక్నిక్‌ పరీక్షల్లో పలు సంస్కరణలను అమలు చేశారు

పాలిటెక్నిక్‌ ఫలితాల విడుదల

హైదరాబాద్‌, జులై 19 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ ఫలితాలను సాంకేతిక విద్యామండలి అధికారులు సోమవారం వెల్లడించారు. మొత్తంగా 11వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, క్రెడిట్ల ప్రకారం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కరోనాతో పాలిటెక్నిక్‌ పరీక్షల్లో పలు సంస్కరణలను అమలు చేశారు. 60 మార్కులకు మాత్రమే పరీక్షలు నిర్వహించి, విద్యార్థి సాధించిన మొత్తం మార్కులను 80 మార్కులకు లెక్కించి తుది మార్కులను ఖరారు చేశారు. డిప్లొమా కోర్సులు టెక్నికల్‌ కోర్సులు కావడంతో ఎస్సెస్సీ, ఇంటర్‌లా సిలబస్‌ తగ్గించే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.


ఇక 40మార్కులకు నిర్వహించాల్సిన మిడ్‌-1, మిడ్‌-2 ఎగ్జామ్స్‌ను రద్దు చేసి, ఎండ్‌ సెమిస్టర్‌లో కలిపి మొత్తం 80 మార్కులకు పరీక్షలను నిర్వహించి, ఆయా ఫలితాలు వెల్లడించారు. ఒక్కో సబ్జెక్ట్‌ జవాబు పత్రాల డౌన్‌లోడింగ్‌కు రూ.700, రీవ్యాల్యూయేషన్‌కు రూ.3,500ను చెల్లించి ఈనెల 22వ తేదీలోగా చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు.


డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఐఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌ పది రోజుల్లో విడుదలయ్యే అవకాశముంది. ఈ సెట్‌ కన్వీనర్‌గా పాఠశాల విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసచారిని నియమించారు.  


Updated Date - 2021-07-20T16:11:48+05:30 IST