24 నుంచి పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ
ABN , First Publish Date - 2021-05-22T16:07:31+05:30 IST
పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2021 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. పదోతరగతి, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2021 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. పదోతరగతి, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.300 ఆలస్య రుసుముతో జూన్ 15వరకు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు 040-23222192 కు ఫోన్ చేయొచ్చని, వెబ్‌సైట్ www.polycetts.nic.in చూడాలని సంబంధిత అధికారులు చెప్పారు.