16 నుంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-01-13T15:34:43+05:30 IST

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈనెల 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల

16 నుంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈనెల 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. 24న అర్హుల జాబితా విడుదల చేస్తారు. 24-25 వరకు వెబ్‌ ఆప్షన్లకు గడువు ఉంటుందని, 27న విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామని కన్వీనర్‌ ఆచార్య పి.రమేశ్‌ బాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, రెండో విడత కౌన్సెలింగ్‌ ఫిబ్రవరి 8 నుంచి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2021-01-13T15:34:43+05:30 IST