Alert: గడువు 30 వరకు పొడిగింపు
ABN , First Publish Date - 2021-11-26T14:04:43+05:30 IST
రాష్ట్రంలో..

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 20న ప్రారంభమైన పీజీఈసెట్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. ఈనెల 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆ సెట్ కన్వీనర్ ఆచార్య రమేశ్ బాబు తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను డిసెంబరు 7న ప్రకటిస్తామని ఒక ప్రకటనలో చెప్పారు.