పీజీ విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లించాల్సిందే

ABN , First Publish Date - 2021-08-10T17:31:20+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో పీజీ విద్యార్థులతో పనిచేయించుకుంటోన్న మెడికల్‌ కాలేజీలు వారికి స్టైపెండ్‌చెల్లించాల్సిందేనని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ ప్రెసిడెంట్‌ రమేశ్‌ సోమవారం ఓ ప్రకటన

పీజీ విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లించాల్సిందే

మెడికల్‌ కాలేజీలకు తేల్చి చెప్పిన ఎన్‌ఎంసీ

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కరోనా విపత్కర పరిస్థితుల్లో పీజీ విద్యార్థులతో పనిచేయించుకుంటోన్న మెడికల్‌ కాలేజీలు వారికి స్టైపెండ్‌చెల్లించాల్సిందేనని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ ప్రెసిడెంట్‌ రమేశ్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు నిర్వహించకపోయినా స్టైపెండ్‌ ఇవ్వాల్సిందేనని ఆయన సూచించారు. అయితే ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన కాలేజీలు విద్యార్థులను సీనియర్‌ రెసిడెంట్లుగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా ప్రమోట్‌ చేయాలని ఆదేశించారు. అంతేగాక ఆయా కాలేజీల పేరిట వారికి అన్ని రకాల గుర్తింపు పత్రాలను అందజేయాలన్నారు.

Updated Date - 2021-08-10T17:31:20+05:30 IST