మూతబడిన బడులు తెరవండి: TPTF
ABN , First Publish Date - 2021-10-21T15:11:49+05:30 IST
రాష్ట్రంలో మూతబడిన..
రాష్ట్రంలో మూతబడిన స్కూళ్లను వెంటనే తెరవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. 1201 స్కూళ్లలో పిల్లలు లేరని మూసివేయడాన్ని అశాస్త్రీయ చర్యగా భావిస్తున్నామని, విద్యాశాఖ అధికారులు వాటిని సందర్శించకుండానే, తల్లిదండ్రులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలపకుండానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమణ, మైస శ్రీనివాసులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చర్యను సామజిక నేరంగా భావించాలని అభిప్రాయపడ్డారు.